బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

10-04-202 బుధవారం దినఫలాలు - అనుక్షణం ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి...

Karkatam
శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర శు॥ విదియ రా.8.15 అశ్వని ఉ.7.11 భరణి తె.6.05 సా.4.20ల 5.52, ప. దు. 11.30 ల 12.21.
 
మేషం :- బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. చేపట్టిన పనులు సక్రమంగా నిర్వర్తించలేకపోతారు. భాగస్వామ్యుల మధ్య అసందర్భపు మాటలు తలెత్తె అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. స్టేషనరీ ప్రింటింగ్ రంగాలవారికి శుభం చేకూరుతుంది. ఖర్చులు పెరగటంతో అదనపు రాబడికైయత్నిస్తారు. 
 
వృషభం :- రాజకీయ, కళారంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. పాత రుణాలు తీరుస్తారు. స్త్రీల షాపింగుల్లోను, చెల్లింపుల్లోను అప్రమతత్తత అవసరం. వ్యాపారాల విస్తరణలు, సంస్థల స్థాపనలకు కావలసిన అనుమతులు మంజూరవుతాయి. ఏ పనైనా మొదలు పెట్టేముందు అన్ని రకాలుగా ఆలోచించండి.
 
మిథునం :- ఆర్థిక వ్యవహరాల్లో కొంత పురోగతి సాధిస్తారు. దుబారా ఖర్చులు నివారించగల్గుతారు. గత తప్పిదాలు పునరావృతంకాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. స్త్రీలపై చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. ఆత్మీయులతో కలసి విహార యాత్రలలో పాల్గొంటారు. వాహనచోదకులకు మెళకువ వహించండి.
 
కర్కాటకం :- ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకుడు తొలగుతాయి. చేస్తున్న పనిపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. పెద్దలను, ప్రముఖులను కలుసుకోగలుగుతారు. సభ, సమావేశాలలో పాల్గొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి.
 
సింహం :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం లభిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహరాలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో రాణిస్తారు. రావలసిన ధనం అందటంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.
 
కన్య :- రాజకీయ, కళారంగాల వారికి సన్మానం జరిగే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు మనస్సు విప్పి మాట్లాడండి. వృత్తి వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. బంధువుల రాకతో ఆకస్మికంగా ఖర్చులు అధికమవుతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. క్రీడారంగాలలో చురుకుగాపాల్గొంటారు.
 
తుల :- సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. ఏజెంట్లు, మార్కెటింగ్ రంగాలవారి శ్రమకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు.
 
వృశ్చికం :- వ్యాపారాలపై దృష్టి పెడతారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు అనుకూలం. అనుక్షణం ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులను మొండిబాకీలు వేధిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రయాణాలలో ఎక్కువ చికాకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రముఖుల కలయిక సాధ్యం కాకపోవచ్చు.
 
ధనస్సు :- అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. ఐరన్ రంగం వారికి ఆటంకాలు. అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. విద్యుత్ రంగాల వారికి పనిలో ఒత్తిడి అధికమవుతుంది.
 
మకరం :- ప్రముఖులను కలుసుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. వృత్తుల వారికి సదావకాశాలు, ప్రజా సంబంధాలు బలపడతాయి. బీమా, పెన్షన్, వ్యవహారాలు క్రయవిక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి. దైవ సేవ, పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తితో పాటు ధనం అధికంగా వెచ్చిస్తారు.
 
కుంభం :- మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. సహకార సంఘాలలో వారికి రాజకీయాలలో వారికి చికాకు తప్పదు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, ఒప్పందాల్లో మెళకువ వహించండి. ఆలయాలను సందర్శిస్తారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం.
 
మీనం :- ఆర్థిక విషయాల్లో ఒడిదిడుకులు వ్యవహరిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చి ఊపిరి పీల్చుకుంటారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధువుల మద్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.