మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
సంకల్పసిద్ధికి పట్టుదల, కృషి ప్రధానం. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. పెట్టుబడులకు తరుణం కాదు. బుధవారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. వివాహయత్నం ఫలిస్తుంది. జాతక పొంతన ప్రధానం. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు ఒక పట్టాన పరిష్కారం కావు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. గురువారం నాడు ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరం. దైవకార్యానికి విపరీతంగా వ్యయం చేస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఆదివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. పదువులు, బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రత్యర్ధులతో జాగ్రత్త. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. పెట్టిపోతల్లో ఏకాగ్రత వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. సోమవారం నాడు పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. సంతానం దూకుడు అదుపుచేయండి. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆహ్వానం అందుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్నవ్యాపారులకు నిరాశాజనకం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
సింహం : 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
సంప్రదింపులు ఫలించవు. విమర్శలు, అభియోగాలు ఎదుర్కుంటారు. మీ తప్పిదాలు సరిదిద్దుకోవటానికి యత్నించండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. గృహ సందడిగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులను నమ్మవద్దు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు ఉల్లాసాన్నిస్తాయి. బంగారం, వెండి వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. కంప్యూటర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
ఈ వారం ప్రతికూలతలు అధికం. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఖర్చులు అదుపులో ఉండవు. దైవకార్యానికి విపరీతంగా వ్యయం చేస్తారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సన్నిహితులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. కలిసివచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. వ్యవసాయ కూలీలకు ఆందోళన అధికం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లకు మార్పులు అనుకూలిస్తాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
తుల: చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ఆర్థికంగా బాగుంటుంది. రుణ సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. పనులు వేగవంతమవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. గురువారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. కొంతమంది వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనంతో మెలగండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. విందులకు హాజరవుతారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదము, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. శుక్రవారం నాడు చేసిన పనులే చేయవలసి వస్తుంది. ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు మన్ననలు అందుకుంటారు. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం. వాహనదారులకు అత్యుత్సాహం తగదు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
పట్టుదలతో శ్రమిస్తే కార్యం సిద్ధిస్తుంది. మొక్కుబడిగా యత్నాలు సాగించవద్దు. గుట్టుగా మెలగండి. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపునకు అవకాశం లేదు. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. పాత మిత్రులు తారసపడతారు. గత అనుభవాలు ఉల్లాసాన్నిస్తాయి. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం ఉద్యోగయత్నం ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి. అధికారులకు బాధ్యతల మార్పు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాదాలు సద్దుమణుగుతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
ప్రతికూలతలు అధికం. కష్టించినా ఫలితం అంతంతమాత్రమే. ఆశావహదృక్పధంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. సంతానం విద్యాత్నం నిదానంగా ఫలిస్తుంది. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మంగళ, బుధవారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
మనోధైర్యంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. ఏది జరిగినా మంచికేనని భావించండి. యత్నాలకు ఆప్తుల సహకరిస్తారు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పత్రాలు అందుకుంటారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. గురువారం నాడు అనుకోని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు ముందుకు సాగవు. శకునాలను పట్టించుకోవద్దు. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వేడుకల్లో పాల్గొంటారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
ఆచితూచి అడుగేయాలి. ఎవరినీ నిందించవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆరోగ్యం బాగుంటేంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. శుక్ర, శనివారాల్లో ముఖ్యల కలయిక వీలుపడదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకోగల్గుతారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి.