శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 7 మార్చి 2023 (23:16 IST)

నల్లతుమ్మ బంక ముక్కల పొడికి పటికబెల్లం కలుపుకుని చప్పరిస్తే? (video)

నల్లతుమ్మచెట్టు. ఈ చెట్టు కొమ్మలతో వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు తయారుచేస్తుంటారు. ఐతే ఈ చెట్టు ఆకులు, జిగురు, కొమ్మలు కాల్చాక వచ్చే బొగ్గుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. తుమ్మకాయల పొడి, తుమ్మబంక పొడి రెండింటిని సమంగా కలిపి ఒక చెంచా పొడికి చెంచా తేనె కలుపుకుని తింటే విరిగిన ఎముకల అతుక్కుంటాయి.
 
నల్లతుమ్మ బంకను చిన్నముక్కలుగా నలగ్గొట్టి కొద్దిగా ఆవునేతిలో వేయించి ఆ తర్వాత దంచి జల్లెడపట్టి ఆ పొడికి సమానంగా పటికబెల్లం కలిపి రోజూ చిటికెడు చప్పరిస్తుంటే స్త్రీపురుషుల దేహశక్తి పెరుగుతుంది. నల్లతుమ్మకు అధిక కొలెస్ట్రాల్ తగ్గించే శక్తి వుంది. మధుమేహం నియంత్రించే శక్తి నల్లతుమ్మకి వున్నదని చెపుతారు.
 
శరీరంపై చిన్న గాయాలకు చికిత్స చేయడానికి కూడా తుమ్మజిగురును ఉపయోగిస్తారు. నల్లతుమ్మ బొగ్గుపొడిని పొంగించిన పటికపొడితో కలిపి పళ్లు తోముకుంటే దంత సమస్యలు తగ్గుతాయి. గమనిక: ఈ ఆయుర్వేద చిట్కాలను ఆచరించే ముందు ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించాలి.