శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2017 (12:31 IST)

లైంగిక సామర్థ్యాన్ని పెంచి.. సంతానలేమిని దూరం చేసే అశ్వగంధ

లైంగిక సామర్థ్యాన్ని అశ్వగంధ చూర్ణం పెంచుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. నరాల బలహీనతను ఈ చూర్ణం దూరం చేస్తుంది. వంద గ్రాముల అశ్వ‌గంధ పొడిని తీసుకుని అందులో పావు కిలో నెయ్యిని కలుపుకోవాలి. ఆ మిశ్ర

లైంగిక సామర్థ్యాన్ని అశ్వగంధ చూర్ణం పెంచుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. నరాల బలహీనతను ఈ చూర్ణం దూరం చేస్తుంది. వంద గ్రాముల అశ్వ‌గంధ పొడిని తీసుకుని అందులో పావు కిలో నెయ్యిని కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఓ సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజూ ఒక టీస్పూన్ చొప్పున ఒక గ్లాసు వేడి పాలు లేదా గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని.. వీర్య లోపాలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.  
 
అలాగే అశ్వగంధ చూర్ణాన్ని పది గ్రాముల మోతాదులో తీసుకుని అరగ్లాసు వేడిపాలలో కలిపి మహిళలు రుతుక్రమం అయిన నాలుగో రోజు నుంచి తీసుకుంటే సంతాన లేమిని దూరం చేసుకోవచ్చు. ఇదే విధంగా పురుషులు తీసుకుంటే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
 
అశ్వ‌గంధ చూర్ణం, నెయ్యి, చ‌క్కెర‌ల‌ను స‌మాన భాగాల్లో తీసుకుని బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని నిత్యం సేవిస్తుంటే త‌ద్వారా పురుషుల్లో వీర్య క‌ణాల ఉత్ప‌త్తి పెరుగుతుంది. అశ్వగంధ పొడిని ఐదు గ్రాములు, పటిక బెల్లం పొడి ఐదు గ్రాములు కలిపి మహిళలు రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే అధిక రక్తస్రావం క్రమం అవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.