ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2017 (14:26 IST)

ఆయిలీ స్కిన్‌.. బ్లాక్ హెడ్స్‌కు చెక్ పెట్టే కొత్తిమీర..

కొత్తిమీర వంటకాలకు మంచి వాసనను ఇవ్వడమే కాకుండా బరువును తగ్గించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులోని సి,కె. ఐరన్, క్యాల్షియం వంటివి పుష్కలంగా వున్నాయి. ఎముకలకు కొత్తిమీర మేలు చేస్తుంది. రక్త ప్రసరణను

కొత్తిమీర వంటకాలకు మంచి వాసనను ఇవ్వడమే కాకుండా బరువును తగ్గించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులోని సి,కె. ఐరన్, క్యాల్షియం వంటివి పుష్కలంగా వున్నాయి. ఎముకలకు కొత్తిమీర మేలు చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కొత్తిమీర పొడి ఒక స్పూన్ తీసుకుని నీటిలో మరిగించి తీసుకుంటే చర్మ క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. 
 
కొత్తిమీరను రోజూ ఆహారంలో తీసుకునే వారికి ముడతలుండవు. చర్మ ఆరోగ్యానికి కొత్తిమీర ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీర ఆకులను తీసుకోవడం ద్వారా మధుమేహానికి చెక్ పెట్టవచ్చు. రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ చురుగ్గా వుంటుంది. ఇందులోని సహజ సిద్ధమైన యాంటీ-బయోటిక్ చర్మ సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. గ్యాస్ట్రిక్, ఫ్లూ, హైబీపీ, బ్రెస్ట్ క్యాన్సర్‌కు దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
 
కొత్తిమీర రసాన్ని ముఖానికి పట్టించి గంట తర్వాత కడిగేస్తే.. ఆయిలీ స్కిన్ నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే బ్లాక్ హెడ్స్ తొలగిపోవాలంటే... ఒక టీ స్పూన్ కొత్తిమీర జ్యూస్, ఒక స్పూన్ లెమన్ జ్యూస్‌ను కలుపుకుని పూతలా వేసుకోవాలి. గంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం వుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.