బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (17:25 IST)

లవంగాలతో వీర్యకణాల వృద్ధికి....

తేనె కొన్ని చుక్కల లవంగాల నూనెను గోరువెచ్చని నీటిలో కలిపి మూడుసార్లు త్రాగితే జలుబు నుండి ఉపశమనం పొందవచ్చును. లవంగాలను పొడి చేసి నీళ్ళలో తడిపి ఈ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనస్‌ తగ్గి ఉపశమనం కల

తేనె కొన్ని చుక్కల లవంగాల నూనెను గోరువెచ్చని నీటిలో కలిపి మూడుసార్లు త్రాగితే జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు. లవంగాలను పొడి చేసి నీళ్ళలో తడిపి ఈ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనస్‌ తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఆహారంలో లవంగాన్ని ఉపయోగించడం వలన ఒత్తిడి, అలసట, ఆయాసం నుండి ఉపశమనం లభిస్తుంది. లవంగాలు వీర్యకణాల వృద్ధికి మంచిగా తోడ్పడుతాయి.
 
తులసి, పుదీనా, లవంగాలు, యాలుకలను మిశ్రమాన్ని టీ చేసుకుని త్రాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడిని నుండి విముక్తి చెందవచ్చును. కానీ ఈ టీలో చక్కెరకు బదులు తేనెను కలుపుకుని తాగితే ఉత్తమం. దగ్గుకు సహజమైన మందు లవంగం. దగ్గుకే కాదు శ్వాస సంబంధిత సమస్యలకు కూడా లంవగాలు చాలా ఉపయోగపడుతాయి.

లవంగాలలో ఉండే యూజెనాల్‌ అనే రసాయన పదార్థం పంటినొప్పిని తగ్గించుటకు సహాయపడుతుంది. లవంగాలలోని ఘాటు పంటినొప్పిని, నోటిలోని బ్యాక్టీరియాలను కూడా నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.