శుక్రవారం, 2 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 జూన్ 2022 (15:16 IST)

థైరాయిడ్ సమస్యకు బై బై చెప్పాలంటే..?

Moringa leaves
థైరాయిడ్ సమస్యకు బై బై చెప్పాలంటే.. వారానికి రెండు సార్లైనా మునగ ఆకులు వంటల్లో చేర్చుకోవడం మంచిది. మునగ ఆకులను సూపర్ ఫుడ్‌గా చెప్పవచ్చు. థైరాయిడ్ పనితీరుకు సహాయపడే సెలీనియం,జింక్ అనేవి మునగ ఆకులలో సమృద్దిగా ఉంటాయి. 
 
ఈ ఆకులలో విటమిన్ A,E,C,B విటమిన్స్ సమృద్దిగా ఉండుట వలన థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ ఆకులలో ఉన్న పోషకాలు అలసట, బద్దకం, నీరసం తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. 
 
మునగ ఆకులతో పొడి తయారు చేసుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఇలా చేస్తే శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఒక స్పూన్ మునగ పువ్వుల రసమును ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగుచున్న ఉబ్బసానికి, అజీర్తికి మంచి ఔషధముగా పనిచేస్తుంది. 
 
ఒక చెంచా మునగాకు రసములో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ పడుకునే ముందు తాగినట్లైతే రేచీకటి తగ్గుతుంది. ఇంకా ఙ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
 
చర్మానికి మేలు చేసే మునగాకు
మునగాకు రసము నందు నువ్వులనూనె కలిపి నీరంతా ఆవిరి అయ్యేంత వరకు మరగకాచి ఆ మిశ్రమాన్ని గజ్జి, దురద వంటి చర్మవ్యాధులకు పైపూత ముందుగా రాసినట్లైతే చర్మవ్యాధులు అంతరించిపోతాయి.
 
మునగాకు రసములో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకున్నట్లైతే మొటిమలు నశించి ముఖచర్మం మృదువుగా అగును.
 
ఒకస్పూను మునగాకు రసములో 3 మిరియాలు పొడి చేసి కలిపి కణతలు పైన రాసుకున్న తలనొప్పి అంతరించును.