శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : మంగళవారం, 11 జూన్ 2019 (13:10 IST)

ఒత్తిడిని తిప్పికొట్టాలంటే... పసుపు పాలు తాగాల్సిందే

ఒత్తిడిని తిప్పికొట్టడంలో పసుపు దివ్యౌషధంగా పనిచేస్తుంది. పసుపులోని కుర్‌క్యుమిన్‌ ఆనందంగా ఉంచే డోపమైన్‌, సెరటోనిన్‌ హార్మోన్ల స్రావాలను పెంచడం ద్వారా డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. కాబట్టి దీన్ని పాలల్లో వేసి మరిగించి పడుకునేముందు తాగితే ఒత్తిడి తగ్గి హాయిగా నిద్ర పడుతుంది. 
 
అలాగే దీర్ఘకాలిక ఒత్తిడితో బాధపడేవాళ్లకి అశ్వగంధాన్ని ఉపయోగించవచ్చు. ఒక టీ స్పూను పొడిని గోరువెచ్చని పాలల్లో కలిపి పడుకోవడానికి అరగంట ముందు తాగితే నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. ఇంకా ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్‌ హార్మోన్‌ శాతాన్ని తగ్గించుకోవచ్చు. 
 
నాడీకణాల పనితీరుకీ మెదడు చురుకుదనాన్ని పెంచడానికీ వాల్‌నట్స్‌ని మించినవి లేవు. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంతో బాటు మెదడు పనితీరు తగ్గకుండా చేస్తాయి. అందుకే రోజూ ఓ మూడు వాల్‌నట్స్‌ని తీసుకుంటే మంచిది. అయితే వీటిమీద ఉండే ఫైటిక్‌ ఆమ్లం, ఇతరత్రా పదార్థాలు జీర్ణాశయంలోని ఎంజైమ్స్‌ విడుదలని అడ్డుకుంటాయి కాబట్టి నానబెట్టి తింటే మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.