గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chj
Last Modified: శనివారం, 15 సెప్టెంబరు 2018 (12:30 IST)

చిన్న వయసులోనే తెల్లజుట్టా? ఇలా చేస్తే నల్లబడుతుందంతే...

చాలామంది పిల్లలు యవ్వన దశలోకి అడుగుపెడుతుండగా జుట్టు తెల్లబడిపోతుంది. దీనితో కేశాలను నల్లగా మార్చుకునేందుకు రకరకాల రంగులను జుట్టుకు వేస్తుంటారు. ఇలా వాడడం వల్ల జుట్టు వూడిపోవడం జరుగుతుంది. అందువల్ల అలాంటి వాటికి స్వస్తి చెప్పి తెల్ల జుట్టుకు నల్ల శోభ

చాలామంది పిల్లలు యవ్వన దశలోకి అడుగుపెడుతుండగా జుట్టు తెల్లబడిపోతుంది. దీనితో కేశాలను నల్లగా మార్చుకునేందుకు రకరకాల రంగులను జుట్టుకు వేస్తుంటారు. ఇలా వాడడం వల్ల జుట్టు వూడిపోవడం జరుగుతుంది. అందువల్ల అలాంటి వాటికి స్వస్తి చెప్పి తెల్ల జుట్టుకు నల్ల శోభ తెచ్చిపెట్టే చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం.
 
1. ఒక కప్పు ఎండు ఉసిరికాయల పొడి, రెండు కప్పుల పెరుగు తీసుకుని ఈ రెండిటిని బాగా కలిపి ఓ ఇనుము పాత్రలో రాత్రంతా ఉంచి మరుసటి రోజు జుట్టుకు పెట్టుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని వాడటంవళ్ల సహజంగానే తెల్లవెంట్రుకలు నల్లబడుతాయి.
 
2. ఒక కప్పు ఉసిరి కాయలను నాలుగు కప్పుల నీటిలో వేసి బాగా మరగబెట్టాలి. ఇందులో ఓ చిటికెడు పంచదార వేసి ఈ మిశ్రమంలోని నీరు ఓ కప్పు వరకు ఇంకేలా మరగబెట్టాలి. రెండు కప్పుల హెన్నాలో కోడిగుడ్డు, నిమ్మరసం, మరిగించిన ఉసిరికాయల మిశ్రమాన్ని కలిపి తలకు పట్టించాలి. ఓ రెండు గంటల పాటు వుంచి తరువాత కడిగివేయాలి. ఇలా చేయడం ద్వారా జుట్టు బలపడటమేకాక నల్లగా కూడా మారుతుంది.