ఈపీఎస్-95.. ఇక రూ. 1000 నుంచి రూ.3వేలకు పెరగనున్న ఫించన్
ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్-95) ఖాతాదారులకు ఓ శుభవార్త. ఇకపై వెయ్యి రూపాయలున్న ఫించన్ రూ.3వేలకు పెరగనుంది. ఈ మేరకు గురువారం ఈపీఎఫ్‌లో ట్రస్టీల బోర్డు సమావేశం కానుంది. ప్రస్తుతం అందిస్తున్న వెయ్యి రూపాయల కనీస ఫించన్‌ను రూ.3వేలకు పెంచాలని యోచిస్తోంది. అదే జరిగితే దేశ వ్యాప్తంగా 50లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది.
అంతేగాకుండా ఈపీఎఫ్ వడ్డీ రేట్ల కూడా బోర్డు ఖరారు చేయనుంది. మార్కెట్లో వడ్డీ రేట్లు పడిపోతున్నప్పటికీ ఎన్నికల సంవత్సరం కావడంతో ఈపీఎఫ్ వడ్డీరేటును మాత్రం 8.55 శాతంగానే వుంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయెల్ బడ్జెట్‌లో మెగా పెన్షన్ స్కీమ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రధాన మంత్రి యోగి మాంధన్ పథకం కింద నెలసరి పెన్షన్ రూ.3వేల మేరకు పెరగనుంది. ఏదేని సంస్థలో పదేళ్లకు మించి బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ఈ పెన్షన్ పొందేందుకు అర్హులని ఈపీఎఫ్ఓ వెల్లడించింది.