గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (18:35 IST)

ఈ నెల 28, 29 తేదీల్లో జీ-20 సదస్సు

ఈ నెల 28, 29 తేదీల్లో జీ-20 సదస్సు జరగనుంది. ఈ జీ-20 సమ్మిట్‌లో భారత ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సదస్సు జపాన్‌లోని ఒసాకా నగరంలో జరగనుంది. ఈ సదస్సులో భారత్‌తో పాటు పలు ముఖ్యమైన దేశాల అధినేతలు పాల్గొంటారు. 
 
ఫ్రాన్స్, జపాన్, ఇండోనేషియా, అమెరికా, టర్కీలతో సహా పది దేశాలకు చెందిన దేశాధినేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీ చర్చలు జరుపనున్నారు. కాగా జీ-20 సమ్మిట్‌కు జపాన్ ఆతిధ్యం ఇస్తుండడం ఇదే మొదటిసారి.