బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (10:52 IST)

డిసెంబరు ఒకటో తేదీ నుంచి నయా రూల్స్ - వినియోగదారులకు షాక్

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు తన ఖాతాదారులకు తేరుకోలేని షాకిచ్చింది. ముఖ్యంగా, ఈఎంఐ విధానాన్ని ఎంచుకునే కొనుగోలుదార్ల నుంచి అదనపు చార్జీలను వసూలు చేయనుంది. ముఖ్యంగా, ఈఎంఐ కొనుగోళ్ళపై 99 రూపాయలతో పాటు ఇతర పన్నులు చెల్లించాల్సివుంది. అంటే ఆన్‌లైన్ షాపింగ్‌తో పాటు మర్చంట్స్ దగ్గర ఈఎంఐ విధానంలో డబ్బులు చెల్లిస్తే ఈ చార్జీలు వర్తిస్తాయి. ఈ చార్జీలన 2021 డిసెంబరు ఒకటో తేదీ నుంచి వసూలు చేయనుంది. 
 
అలాగే, ఈపీఎఫ్ ఖాతాదారులకు నవంబరు 30వ తేదీ లోపు తప్పనిసరిగా యూనివర్సల్ అకౌంట్ నంబరును ఆధార్ నంబరుతో అనుసంధానించాల్సి ఉంటుంది. గతంలో 2021 సెప్టెంబరు 1వ తేదీ లోగా ఉన్న గడువును 2021 నవంబరు 30వ తేదీ వరకు పొడగించారు. ఇపుడు మరోమారు డిసెంబరు నెలాఖరు వరకు పొడగించారు. వీటితో పాటు అనేక రకాలైన మార్పులు డిసెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.