మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (10:16 IST)

కరోనా.. భారీగా నష్టపోయిన భారత స్టాక్ మార్కెట్

కరోనా నేపథ్యంలో ప్రపంచ మార్కెట్స్ భారీగా గ్లోబల్ రిసెషన్ నుంచి గ్లోబల్ డిప్రెషన్ వైపు కదులుతున్నాయి. దీంతో బాంబే స్టాక్ మార్కెట్ గురువారం భారీగా పతనమైంది. సెన్సెక్స్ ఏకంగా 1652 పాయింట్లు నష్టపోయి 27217 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అటు నిఫ్టీ సైతం కీలకమైన 8000 పాయింట్ల దిగువన ప్రారంభమైంది. నిఫ్టీ ప్రారంభంలోనే 500 పాయింట్లు నష్టపోయి 7967 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
 
ఫలితంగా బ్యాంకింగ్ స్టాక్స్, ఐటీ స్టాక్స్ భారీగా పతనమైనాయి. ఈ క్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, కొటాక్ మహీంద్రా, రిలయన్స్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి. ఈ కారణంగా ఆసియా మార్కెట్స్, యూఎస్ మార్కెట్స్ కనిష్ట స్థాయిని తాకాయి.