శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 18 నవంబరు 2024 (18:28 IST)

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో 20కి పైగా జిల్లాల్లో యూజర్లకు Vi ఇండోర్ నెట్‌వర్క్ అనుభూతి

mobile massage
ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణలోని 20కి పైగా జిల్లాల్లో తమ నెట్‌వర్క్‌ను గణనీయంగా మెరుగు పరచినట్లు దిగ్గజ టెలికాం ఆపరేటర్ Vi ప్రకటించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, కర్నూలు, అనంతపురం, కడప, ఏలూరు, ఒంగోలు, నంద్యాల, ప్రొద్దుటూరు, భీమవరం, తెనాలి, మచిలీపట్నం, నరసరావుపేట, ఆదోని, తాడిపత్రి, హిందూపురం, గుంతకల్లు, గుడివాడ, ధర్మవరం, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి మొదలైన కీలక ప్రాంతాల్లో 3,450+ సైట్లలో సమర్ధమంతమైన 900 MHz స్పెక్ట్రంను విజయవంతంగా వినియోగంలోకి తెచ్చింది. 
 
ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వల్ల Vi వినియోగదారులు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు అలాగే జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని వారు, మెరుగైన ఇండోర్ నెట్‌వర్క్ అనుభవాన్ని పొందగలుగుతారు. దీనితో పాటు Vi గిగానెట్ నెట్‌వర్క్ ద్వారా యూజర్లకు వేగవంతమైన డేటా స్పీడ్‌ను అందించేలా ఈ రాష్ట్రాలవ్యాప్తంగా 5,000+ సైట్లలో 2500 MHz బ్యాండ్‌లో నెట్‌వర్క్ సామర్ధ్యాన్ని రెట్టింపు చేసుకునే దిశగా Vi తమ స్పెక్ట్రంను 10 MHz నుంచి 20 MHzకి పెంచుకుంది.
 
నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేసుకోవడం, తమ వినియోగదారులకు Vi యొక్క అత్యుత్తమ నెట్‌వర్క్ అనుభూతిని అందించడం అనే Vi విస్తృత వ్యూహంలో భాగంగా ఈ విస్తరణ చేపట్టబడింది. “ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణలో Vi నెట్‌వర్క్‌ను మెరుగుపర్చుకునే దిశగా 900 MHz వినియోగం, 2500 MHz అప్‌గ్రేడేషన్ అనేవి కీలక అడుగులు. మరింత మెరుగైన ఇండోర్ కవరేజీ, అత్యుత్తమ కాలింగ్, మా అత్యుత్తమ నెట్‌వర్క్ అయిన Vi గిగానెట్‌పై అత్యంత వేగవంతమైన డేటా స్పీడ్‌లను Vi యూజర్లు అనుభూతి చెందడానికి ఈ అప్‌గ్రేడేషన్ తోడ్పడుతుంది. రాబోయే రోజుల్లోనూ మేము మా నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకోవడంపై, డిజిటల్ ప్రపంచంలో విశిష్టమైన అనుభూతిని పొందేలా మా కస్టమర్లకు అత్యుత్తమ ఆఫర్లను అందించడంపై మరింతగా దృష్టి పెడతాం” అని వొడాఫోన్ ఐడియా క్లస్టర్ బిజినెస్ హెడ్ (ఏపీ & తెలంగాణ & కర్ణాటక) ఆనంద్ దానీ తెలిపారు. Vi తమ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లు మరియు ప్లాన్లను కూడా ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణలో ఇటీవల ప్రవేశపెట్టిన వాటిల్లో కొన్ని:
 
Vi గ్యారంటీ ప్రోగ్రాం: Vi యాప్‌లో ఎంచుకున్న పక్షంలో, వరుసగా 13 రీచార్జ్ సైకిల్స్‌కి సంబంధించి ప్రతి 28 రోజులకు 10 జీబీ డేటా ఆటోమేటిక్‌గా క్రెడిట్ అవుతుంది. తద్వారా Vi వినియోగదారులకు ఏడాది వ్యవధిలో ఖచ్చితంగా 130 జీబీ మేర అదనంగా డేటా లభిస్తుంది. 5G స్మార్ట్‌ఫోన్లు ఉన్న Vi కస్టమర్లకి లేదా ఇటీవలే రూ. 299 లేదా అంతకు మించిన డైలీ డేటా అన్‌లిమిటెడ్ ప్యాక్‌తో కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అయిన వినియోగదారులకి ఈ ఆఫర్ వర్తిస్తుంది.
 
సరికొత్తగా తీర్చిదిద్దిన RED X పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కింద రూ. 1,201 నెలవారీ అద్దెపై నాన్-స్టాప్ సర్ఫింగ్, స్ట్రీమింగ్, మరియు కనెక్టివిటీ కోసం అపరిమితమైన డేటా లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్, 6 నెలల స్విగ్గీ వన్ మెంబర్‌షిప్, 7 రోజుల ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్, అలాగే అన్ని Vi టచ్‌పాయింట్స్‌లో ప్రయారిటీ కస్టమర్ సర్వీసు వంటి కాంప్లిమెంటరీ ఆఫర్లను ఎంచుకునే అవకాశం వినియోగదారులకు లభిస్తుంది.
 
Vi ప్రస్తుతం 70 రోజులకు రూ. 1,198, మరియు 84 రోజులకు రూ. 1,599 ధర ఉండే రెండు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ల కింద నెట్‌ఫ్లిక్స్‌కి యాక్సెస్ అందిస్తోంది. ఈ ప్యాక్‌లు 12 am-6 am అపరిమిత డేటా, వీకెండ్ డేటా రోలోవర్, డేటా డిలైట్ వంటి ఫీచర్లు ఉండే హీరో అన్‌లిమిటెడ్ యొక్క ప్రత్యేక ప్రయోజనాలను కూడా అందిస్తాయి.
 
యూజర్లకు అందుబాటు ధరల్లో మరింత వినోదాన్ని అందించే దిశగా Vi Movies & TV యాప్ ప్రస్తుతం సింగిల్ సబ్‌స్క్రిప్షన్‌తో 17 వరకు ఓటీటీ ప్లాట్‌ఫాంలు మరియు 350 లైవ్ టీవీ ఛానళ్లకు యాక్సెస్ అందిస్తోంది. ఇటీవలే రెండు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు కూడా ఆవిష్కరించబడ్డాయి. నెలకు రూ. 248తో Vi Movies & TV Plus మరియు నెలకు రూ. 154తో Vi Movies & TV Lite వీటిలో ఉన్నాయి.
 
ఓటీటీ ప్లాట్‌ఫాంలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో Vi తమ బండ్లింగ్ ప్లాన్లను కూడా విస్తరిస్తోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీలివ్, మరియు సన్ నెక్స్ట్ ఓటీటీ బండిల్స్‌ను అందిస్తోంది మరియు మరిన్ని భాగస్వామ్యాలను కుదుర్చుకుంటోంది.