1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 మార్చి 2022 (11:51 IST)

ఈఎస్ఐసీలో 311 పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ)లో 311 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 
 
ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 17, 2022.
 
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లు మించరాదు.
 
నెలకు 60,000ల నుంచి 2,80,254ల వరకు జీతంగా చెల్లిస్తారు.
 
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌, ఎమ్మెస్సీ, మెడికల్‌ పీజీ/పీజీ డిప్లొమా/ఎండీ/ఎంఎస్‌/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి.
 
ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, అనుభవం, నీట్‌ స్కోర్‌ 2021 ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.