జవర్ నవోదయ ప్రవేశాల దరఖాస్తు గడవు పొడగింపు... ఎప్పటివరకంటే...
వచ్చే విద్యా సంవత్సరం (2024-25)కు జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల గడువు ఆగస్టు 17వ తేదీతో ముగియనుండగా, ఈ గడువును గురువారం పొడగించారు. అర్హులైన అభ్యర్థులు గురువారంలోగా మాత్రమే దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఆగస్టు 10వ తేదీతో గడువు ముగియగా.. మరో వారం రోజుల పాటు గురుకుల విద్యాలయ సమితి పొడిగించిన విషయం తెలిసిందే. గురువారం మరోమారు ఈ నెల 25వ తేదీ వరకు పొడగించింది. అందువల్ల ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
జేఎన్‌వీల్లో 6వ తరగతి సీట్ల భర్తీకి రెండు విడతల్లో ఎంపిక పరీక్ష(JNVST 2024) నిర్వహించాలని అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. నవంబర్ 4(శనివారం)న ఉదయం 11.30 గంటలకు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో, 2024 జనవరి 20 (శనివారం) తేదీన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ ప్రవేశ పరీక్ష,(Jawahar Navodaya Vidyalaya selection test) నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 649 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉండగా.. ఏపీలో 15, తెలంగాణలో 9 చొప్పున ఉన్నాయి.