సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (11:34 IST)

నేడు రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయ(ట్రిపుల్ ఐటీ) ఎంట్రెన్స్ టెస్ట్

హైదరాబాద్ నగరంలో ఉన్న రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయంలో 2021-22 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఆదివారం ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్జీయూకేటీ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కేసీ రెడ్డి తెలిపారు. 
 
నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఆయన మాట్లాడుతూ.. ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో 4,400 సీట్లు ఉన్నాయన్నారు. 
 
ఈ సీట్ల కోసం 75,240 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 467, తెలంగాణలో ఎనిమిది పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.