1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : గురువారం, 22 జనవరి 2015 (14:49 IST)

పిల్లలకు పండ్లు తినడం అలవాటు చేయడం ఎలా?

పిల్లలు పండ్లు తినడం లేదంటూ తల్లిదండ్రులు బాధపడిపోతుంటారు. అందుకే పిల్లలకు నచ్చే విధంగా ఫ్రూట్స్ ఇచ్చినా.. ప్రస్తుతం మోజంతా విదేశీ ఫ్రూట్స్ పైనే పడింది. మనదేశంలో బోలెడు పండ్లుండగా, పిల్లలు స్ట్రాబెర్రీ, లిచి, కివి వంటి పండ్లను తీసుకునే ఆసక్తి చూపుతున్నారు. 
 
కానీ పిల్లలు ఏ పండ్లు తినిపించాలని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. పిల్లలకు రోజుకో పండును ఇవ్వాలి. అరటిలోనే అధిక కెలోరీలు ఉన్నాయి. పిల్లలు లావెక్కకపోతే.. గ్రీన్ బనానా, కేరళ అరటిపండు ఇవ్వడం మంచిది. ఇచ్చే పండులో రసాయనాలు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. 
 
అరటి, జామ, బొప్పాయి, దానిమ్మ పండ్లను పిల్లలకు తినిపించవచ్చు. ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్ వంటి పండ్లు తాజాగా ఉండేందుకోసం రసాయనాలు కలుపుతారు. వీటిని చాలామటుకు తగ్గించడం మంచిది. లేదంటే పండ్లను శుభ్రంగా కడిగి ఆ తర్వాతే కట్ చేసుకుని తినాలి. 
 
ఆపిల్, ఆరెంజ్ పండ్లలో కెలోరీలు తక్కువ కాబట్టి బరువు ఎక్కువగా గల పిల్లలకు ఇవ్వొచ్చు. పండ్లను జ్యూస్‌ల రూపంగా కాకుండా అలాగే తినడం అలవాటు చేయాలి. పండ్లతో పాటు తగిన ఆహారం ఇవ్వాలి. పిల్లల్ని ఆడుకోనివ్వాలి. అప్పుడే పిల్లలు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎదుగుతారని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.