వేసవిలో పిల్లల చర్మం పట్ల జాగ్రత్త.. పిల్లలకంటూ ప్రత్యేకంగా టవల్స్ వాడండి..
వేసవి కాలం.. పిల్లల చర్మం పట్ల తల్లిదండ్రులు అధిక శ్రద్ధ తీసుకోవాలని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో చర్మ సమస్యలను దూరం చేసుకోవాలంటే.. ముఖంలో మట్టి చేరకుండా చూసుకోవాలి. పిల్లలు ఎండలో ఆడన
వేసవి కాలం.. పిల్లల చర్మం పట్ల తల్లిదండ్రులు అధిక శ్రద్ధ తీసుకోవాలని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో చర్మ సమస్యలను దూరం చేసుకోవాలంటే.. ముఖంలో మట్టి చేరకుండా చూసుకోవాలి. పిల్లలు ఎండలో ఆడనివ్వకుండా.. సాయంత్రం పూట కాసేపు ఆడుకోనివ్వాలి. ఆడుకుని వచ్చాక స్నానం చేయించాలి. అప్పుడప్పుడు కాసింత చల్లని నీటితో ముఖం కడుగుతూ చూసుకోవాలి. అప్పుడప్పు దురద వంటి అలెర్జీలకు వైద్యుల సలహా మేరకు క్రీమ్‌లు వాడొచ్చు.
వేసవిలో గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. అప్పుడప్పుడు ముఖం కడగడం.. పరిశుభ్రమైన దుస్తులను తొడగడం.. శుభ్రతతో కూడిన ఆహారాన్ని పెట్టడం వంటివి చేస్తే.. అలర్జీలు ఏమాత్రం పిల్లల దరిచేరవు. వేసవిలోనే కాదు ఏ సీజన్లోనైనా పిల్లలకంటూ ప్రత్యేకంగా టవల్స్ వాడటం చేయాలి.
ఇకపోతే.. విటమిన్ లోపాల కారణంగానూ అలెర్జీలు ఏర్పడతాయి. అందుచేత విటమిన్-ఎతో కూడిన స్వీట్ పొటాటో, క్యారెట్లు, నట్స్, దోసకాయ, క్యాప్సికమ్, మామిడి వంటివి పిల్లల డైట్‌లో చేర్చుకోవాలి. ద్రవ పదార్థాలను పిల్లలకు ఎక్కువగా ఇస్తూ రావాలి.