శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2019 (11:27 IST)

టేస్టీ టేస్టీ కోల్డ్ కాఫీ.. ఎలా చేయాలో తెలుసా..?

కావలసిన పదార్థాలు:
పాలు - 2 కప్పులు
కోకో పౌడర్ - 1 స్పూన్
కాఫీ డికాక్షన్ - అరకప్పు
చక్కెర - సరిపడా
ఫ్రెష్ క్రీం - 5 స్పూన్స్
దాల్చినచెక్క పొడి - 1 స్పూన్
బాదం, పిస్తా తరుగు - 1 స్పూన్
ఐస్‌క్యూబ్స్ - ఒకటిన్నర కప్పు
 
తయారీ విధానం:
ముందుగా పాలను కాచి చల్లార్చి రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తరువాత ఒక బౌల్‌లో డికాక్షన్, పాలు, పంచదార, రెండు మినహా మిగిలిన ఐస్‌క్యూబ్స్, కోకో పౌడర్ వేసి స్టీల్ లేదా ఎలక్ట్రిక్ బ్లండర్‌తో బాగా నురుగు వచ్చేవరకూ గిలకొట్టాలి. ఇప్పుడు మరో గిన్నెలోకి క్రీమ్‌ను తీసుకుని దానిలో రెండు ఐస్‌క్యూబ్స్‌లు, సరిపడా చక్కెర వేసి బాగా నురుగు వచ్చేవరకూ గిలకొట్టాలి. ఆ తరువాత కప్పులు తీసుకుని వాటిలో మూడు వంతులు పాల మిశ్రమం పోసి పైన క్రీమ్ వేసి ఇన్‌స్టెంట్ కాఫీ పౌడర్, దాల్చిన చెక్క పొడి, బాదం, పిస్తా తరుగు చల్లుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ కోల్డ్ కాఫీ రెడీ.