గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2019 (17:39 IST)

చాక్లెట్లను ఫ్రిజ్‌లో కూల్‌ చేసుకుని తింటున్నారా?

చాక్లెట్లను ఫ్రిజ్‌లో పెట్టుకుని తింటున్నారా? అయితే ఇక ఆ పని చేయకండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఎందుకుంటే.. ఫ్రిజ్‌లో వుంచి కూల్ చేసుకుని తినే చాక్లెట్ల ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు. 
 
నిజానికి వాటిని కూల్ చేసి తింటే టేస్ట్ ఉండవు. కలర్, టెక్చర్‌ కూడా మారిపోతుంది. చాక్లెట్లు ముఖ్యంగా కోకో బటర్ చాక్లెట్లు తమ చుట్టూ ఉన్న వాసనల్ని పీల్చుకుంటాయి. అందువల్ల వాటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. బదులుగా వాటిని డ్రై, చల్లటి ప్రదేశంలో ఉంచడం మంచిది.
 
అలాగే కేక్స్‌ని అమ్మే షాపుల వాళ్లు సైతం వాటిని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అలా కాకుండా గాలి చేరని కంటైనర్‌లో లేదా కేక్ టిన్‌లో వాటిని ఉంచడం మంచిది. కేక్ చల్లగా లేకపోతే, మంచి టేస్ట్ ఉంటుంది. 
 
చాక్లెట్లు, కేకులను మాత్రమే కాకుండా.. ఉల్లి, బంగాళాదుంపల్ని ఫ్రిజ్‌లో వుంచకూడదు. ఇంకా రొట్టె, బ్రెడ్ వంటివి ఫ్రిజ్‌లో పెడితే... వెంటనే పాడైపోతాయి. వాటిని గదిలోనే కాస్త చల్లగా, పొడిగా ఉన్న ప్రదేశాల్లో ఉంచడం మంచిదని న్యూట్రీషియన్లు చెప్తున్నారు.