సింక్‌లో నీళ్లు నిలిచిపోతే.. ఏం చేయాలి..?
వంటిల్లంటే తప్పకుండా సింక్ ఉంటుంది. చాలామంది ఆ సింక్‌ను సరిగ్గా శుభ్రం చేసుకోరు. దాని కారణంగా సింక్‌లో ఏం చేసినా నీళ్లు బయటకు వచ్చేస్తుంటాయి. ఇలా ఉన్నప్పుడు చూడడానికే విసుగుగా అనిపిస్తుంది. దాంతో వంటింట్లో వంట చేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే తప్పక ఫలితాలు లభిస్తాయి. మరి ఆ చిట్కాలేంటో చూద్దాం..
1. మీరు చేతులు శుభ్రం చేసుకునేటప్పుడు గానీ లేదా ఏవైనా కూరగాయలు శుభ్రం చేసేటప్పుడు గానీ.. సింక్‌లో నీళ్లు నిలిచిపోతే.. ఒక బాటిల్ నీటిలో 2 స్పూన్ల వంటసోడా కలిపి.. ఆ బాటిల్ నీటిని సింక్‌లో నీళ్లు వెళ్లే ప్రాంతంలో పోయండి.. ఇలా చేస్తే సింక్‌లో నీళ్లు నిలబడకుండా ఉంటాయి.
2. వంట గట్టుపై గుడ్డు పగిలినప్పుడు దాని వాసన విపరీతంగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ ప్రాంతంల్లో కొద్దిగా వంటసోడా లేదా నిమ్మరసం వేసి శుభ్రం చేస్తే వాసన పోతుంది.
3. పప్పు డబ్బాల్లో కొబ్బరి ముక్క వేసుకుంటే పప్పుకి పురుగులు పట్టకుండా ఉంటుంది. కందిపప్పు త్వరగా ఉడకాలంటే.. ముందుగా చింతపండు వేయకండి.
4. పాలు పొంగకుండా ఉండాలంటే.. ఆ గిన్నెకు నెయ్యి రాసుకోవాలి. పాలను విరగ్గొట్టాలంటే.. వాటిని మరిగించి అందులో నిమ్మరసం పిండాలి. ఇలా చేస్తే పాలు వెంటనే విరిగిపోతాయి.