శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By
Last Updated : బుధవారం, 23 జనవరి 2019 (11:02 IST)

ఆలు వేపుడు చేసేటప్పుడు నిమ్మచెక్కను వేసి?

రసం పిండేసిన నిమ్మ చెక్కలను పారేయకుండా.. బంగాళాదుంపలను ఉడికించేటప్పుడు చేర్చి ఉడికిస్తే..  ఆలు వేపుడు రుచికరంగా వుంటుంది. మునగాకును వండేటప్పుడు పావు స్పూన్ పంచదారను కలిపి ఉడికిస్తే.. అంటుకోకుండా ఆకుకూర విడివిడిగా వుంటుంది. అరటికాడ వేపుడు చేసేటప్పుడు కాసింత మునగాకును చేర్చితే.. టేస్టు అదిరిపోతుంది. 
 
బెండకాయల వేపుడు చేసేటప్పుడు కాసింత నిమ్మరసం చేర్చితే జిడ్డుతో బెండ ముక్కలు అంటుకోవు. ఒక స్పూన్ పంచదార కలిపిన నీటిలో ఆకుకూరను పది నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత వండితే రుచి అదిరిపోతుంది. 
 
అలాగే నిమ్మ పండుని కోసేముందు బలంగా చేతులతో నలిపి... ఆ తరువాత కోసి పిండితే రసం సులువుగా వస్తుంది. చేపలు గ్రిల్ చేస్తున్నప్పుడు గ్రిల్‌పై ముందు నిమ్మకాయ ముక్కల్ని పరిచి, దానిపై చేప ముక్కల్ని పెట్టి గ్రిల్ చేయాలి. ఇలా చేస్తే చేపకి మంచి రుచి వస్తుంది.