కాఫీ మరింత రుచిగా వుండాలంటే ఇలా చేయాలి?
ఇంట్లో వంటకాలను సరైన పద్ధతిలో వుంచకుంటే పాడైపోతాయి. అంతేకాదు తినేటప్పుడు కూడా కొన్ని పదార్థాలు మరింత రుచిని సంతరించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సి వుంటుంది. అలాంటి చిట్కాలు ఏమిటో ఒకసారి చూద్దాం.
1. కాఫీ మరింత రుచిగా ఉండాలంటే డికాషన్‌లో చిటికెడు ఉప్పు వేస్తే మరింత రుచిగా ఉంటుంది.
2. బెండకాయ కూర చేయడానికి ముందు ముక్కల మీద కాస్త నిమ్మ రసం చల్లితే జిగురు ఉండదు.
3. కూరలో చింతపండు రసానికి బదులు టమాటా గుజ్జు వేస్తే కూరలు మరింత రుచిగా ఉంటాయి. కూరల రంగు మారకుండా ఉంటుంది.
4. అల్లం వెల్లుల్లిని రుబ్బే ముందు కొద్దిగా వేయించితే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
5. అరటి పువ్వులను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. వాటివల్ల లోపలి పదార్ధాల రుచి, వాసన, రంగు మారిపోతుంది.
6. పప్పులు, ధాన్యాలు, పిండి, బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాలో కొన్ని వేపాకులు వేస్తే పాడవకుండా ఉంటుంది.
7. పచ్చి బఠానీలను ఉడికించేటప్పుడు వాటిలో చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి.