సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (16:54 IST)

ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?

ఆహార పదార్థాలను నిల్వచేసేందుకు ఫ్రిజ్‌ను ఎంచుకుంటాం. ఆహార పదార్థాలు చెడిపోవనుకుని అన్నింటిని ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటాం. కానీ ఫ్రిజ్‌లో పెట్టే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్ అనేది ప్రస్తుతం అత్యవసరమైన వస్తువుగా మారిపోయింది. వారాల పాటు ఫ్రిజ్‌లో నిల్వ వుంచి ఆహార పదార్థాలను తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. 
 
అలా ఫ్రిజ్‌లో కుక్కేసే ఆహార పదార్థాల్లో కోడిగుడ్డు కూడా ఒకటి. ఒక డజను కోడిగుడ్లను షాపు నుంచి తెచ్చుకుని.. వాటిని ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటాం. కానీ కోడిగుడ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కోడిగుడ్లలో  వెంటనే బ్యాక్టీరియా చేరుకుంటాయని.. ముఖ్యంగా ఉదర రుగ్మతలకు దారితీసే.. బ్యాక్టీరియా కోడిగుడ్లను సులభంగా సోకుతాయి. 
 
కోడిగుడ్ల పెంకుల్లో సల్మోనెల్లా అనే బ్యాక్టీరియా సులభంగా ఏర్పడుతుంది. ఇది ఉదర సంబంధిత రుగ్మతలకు దారి తీస్తుంది. ఈ బ్యాక్టీరియా సాధారణ ఉష్ణోగ్రతలో బతకవని.. చల్లని ప్రదేశంలోనే ఆ బ్యాక్టీరియాకు జీవం వుంటుందని.. అందుచేత చల్లని ప్రాంతంలో కోడిగుడ్లను వుంచితే.. ఈ బ్యాక్టీరియా సులభంగా సోకుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా వారాల పాటు కోడిగుడ్లను ఫ్రిజ్‌ల్లో భద్రపరచకుండా తాజాగా షాపుల్లో కొనుక్కొచ్చి అప్పటికప్పుడే వాడుకోవడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.