శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 మే 2021 (15:59 IST)

కరోనా సెకండ్ వేవ్.. మాల్దీవుల్లో భారత పర్యాటకులపై నిషేధం

Maldives
భారత్‌లో కరోనా వైరస్ ప్రభావం అధికంగా వుంది. సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తుండటంతో అనేక దేశాలు భారత్‌కు రాకపోకలు నిలిపివేశాయి. భారత్ నుంచి తమ దేశాలకు వచ్చే వారిపై ఆంక్షలు విధించాయి. ఇక తాజాగా మాల్దీవులు కూడా కీలక ప్రకటన చేసింది. 
 
భారత పర్యాటకులపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం మే 13 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్నీ మాల్దీవులు ఇమ్మిగ్రేషన్ విభాగం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
 
దక్షిణాసియా దేశాలకు చెందిన పర్యాటకులకు మాల్దీవుల్లోకి ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అన్ని రకాల వీసాలకు ఈ నిబంధన వర్తిస్తాయని ట్విట్‌లో తెలిపారు. -