సంబంధిత వార్తలు
ప్రేమికుల రోజున అభిషేక్ శర్మ, లైలా ఫైసల్ వివాహం.. నిజమేనా?
Abhishek Sharma
ముఖ్యంగా ఫిబ్రవరి 14, 2026న వాలెంటైన్స్ డే వీరి వివాహం జరగనుందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంలో అభిషేక్ కానీ, ఆయన కుటుంబం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయితే ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో అంతకుముందు రోజు పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని.. ఇది కేవలం పుకారు మాత్రమేనని క్రీడా విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు.
లైలా ఫైసల్ గురించి ప్రజల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. లైలా ఫైసల్ 2000వ సంవత్సరంలో ఢిల్లీలో జన్మించారు. వారి కుటుంబం కశ్మీర్‌కు చెందినది. ఆమె లండన్‌లోని కింగ్స్ కాలేజీలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ఫ్యాషన్ రంగంపై ఉన్న మక్కువతో లండన్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశారు. ప్రస్తుతం ఆమె ఒక విజయవంతమైన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్.
