ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (16:06 IST)

క్రికెట్‌కు బైబై చెప్పేసిన భజ్జీ.. 2,224 పరుగులు, 417 వికెట్లు

భారత క్రికెట్ యోధుడు భజ్జీ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు బైబై చెప్పేశాడు. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నానంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించేశాడు. ఈ 23 ఏళ్ల ప్రస్థానాన్ని ఆనందమయం, చిరస్మరణీయం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు.
 
1998లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన భజ్జీ ఆఫ్ స్పిన్నర్‌గా టీమిండియా జట్టుకు విశేష సేవలు అందించాడు.  2000 దశకంలో టీమిండియా సాధించిన అనేక విజయాల్లో భజ్జీ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. ఈ పంజాబీ వీరుడు బౌలింగ్ లోనే కాకుండా, బ్యాటింగ్ లోనూ ధాటిగా ఆడుతూ అభిమానులను అలరించాడు. ఆట నుంచి తప్పుకున్న హర్భజన్ క్రికెట్ కామెంటరీ వైపు అడుగులు వేసే అవకాశాలున్నాయి. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 
 
భజ్జీ స్కోర్ రేటు.. 
103 టెస్టులు , 417 వికెట్లు 2,224 పరుగులు చేశాడు. 
వాటిలో 2 సెంచరీలు, 9 అర్ధసెంచరీలు ఉన్నాయి. 
236 వన్డేల్లో 269 వికెట్లు తీసి, 1,237 పరుగులు నమోదు చేశాడు. 
అంతర్జాతీయ టీ20 పోటీల్లో 28 మ్యాచ్ లలో 25 వికెట్లు పడగొట్టాడు. 
2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియాలో భజ్జీ కూడా ఉన్నాడు.