క్రికెట్ ఆడుతుండగా యువకుడి మృతి.. పరుగు కోసం పరిగెత్తుతూ..?
క్రికెటర్లు మైదానంలో కుప్పకూలిపోతున్న ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మైదానంలో గాయపడి, గుండెపోటు రావడంతో మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా క్రికెట్ ఆడుతుండగా యువకుడు మృతిచెందిన ఘటన మేడిపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మృతుడి బంధువులు తెలిపిన కథనం ప్రకారం కోరుట్ల మండలం మోహన్‌రావు పేటకు చెందిన రజాక్ (38) స్నేహితులతో కలిసి శుక్రవారం మేడిపల్లిలో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. కాగా బ్యాటింగ్ చేస్తూ పరుగుకు పరిగెత్తుతుండగా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
జగిత్యాల ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు కోరుట్ల పట్టణంలో రెడిమెడ్ బట్టలదుకాణం నిర్వహిస్తుండేవాడు. అతడి మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.