సోమవారం, 25 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మార్చి 2020 (17:30 IST)

సీఎస్‌కే నన్ను అలా మార్చింది.. ధోనీ హెయిర్ లుక్ అదిరింది..

సీఎస్‌కే జట్టు తనను నాణ్యమైన ప్లేయర్‌‌గా మార్చిందని... మైదానం లోపల, బయట తనకు ఎదురైన క్లిష్టపరిస్థితులను ఎదుర్కొనేందుకు సాయం చేసిందని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటున్నాడు. అలాగే, ఒక మనిషిగా, క్రికెటర్‌‌గా తనను ఎంతగానో మార్చిందని జట్టుపై ప్రశంసల వర్షం కురిపించాడు. 
 
ఇక ఫ్యాన్స్ అందరూ తనను తలా అని పిలవడం గౌరవంగా భావిస్తున్నానని.. చెన్నైకి ఎప్పుడొచ్చినా తనను పేరు పెట్టి పిలవరని చెప్పాడు. వన్డే ప్రపంచ కప్ తర్వాత ఆటకు దూరంగా వున్న మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్ పదమూడో సీజన్‌ ద్వారా క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో కలిసిన ధోనీ చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. 
 
ఇదిలా ఉంటే.. మహేంద్ర సింగ్ ధోనీ కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. భారత జట్టులో హెయిర్ స్ట్రైల్ సంస్కృతికి నాంది పలికిన ఈ జార్ఖండ్ డైనమైట్ ఐపీఎల్ ముంగిట స్టైలిష్ లుక్‌తో మెస్మరైజ్ చేశాడు. కాగా మార్చి 29 నుంచి ఐపీఎల్‌2020 సీజన్‌‌కు తెరలేవనుంది. 
 
ఈ నేపథ్యంలో ఆయా ఫ్రాంఛైజీలన్నీ అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ఇప్పటికే శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశాయి. మార్చి 29న చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ ప్రారంభం కానుంది.