గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 మే 2022 (14:15 IST)

కోహ్లీని బంతితో లాగికొట్టిన చెన్నై పేసర్ ముఖేష్ చౌదరి

Virat Kohli
ఐపీఎల్ 2022లో చెన్నై పేసర్ ముఖేష్ చౌదరి.. కింగ్ కోహ్లీని బంతితో లాగికొట్టాడు. గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బెంగళూరు ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగా.. చెన్నై పేసర్ ముఖేష్ చౌదరి బౌలింగ్ చేశాడు. 
 
తొలి ఓవర్ ఐదవ బంతికి బౌండరీ బాదిన కోహ్లీ.. చివరి బంతిని స్ట్రయిట్ షాట్ ఆడాడు. పరుగు కోసం కోహ్లీ రెండగులు ముందుకు వేయగా.. ముకేశ్ బంతిని అందుకుని వికెట్ల వైపు బలంగా విసిరాడు. అదే సమయంలో వెనక్కి వెళుతున్న విరాట్ ఎడమ తొడకు బంతి బలంగా తాకింది.
 
అయితే ముఖేష్ చౌదరి వేసిన త్రో వల్ల విరాట్‌ కోహ్లీకి గాయం కాలేదు. వెంటనే కోహ్లీ వైపు చూసిన ముఖేష్.. సారీ బ్రో అన్నటుగా చేయితో సైగ చేశాడు. పర్లేదు బ్రో అన్నట్టుగా కోహ్లీ కూడా నవ్వుతూ సైగ చేశాడు. 
 
ఇందుకు సంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చుసిన తర్వాత విరాట్ అభిమానులు ముఖేష్‌‌పై చాలా ఫైర్ అవుతున్నారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 13 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది.