మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (11:17 IST)

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన బ్రావో

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు, వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో గురించి.. తెలియని వారుండరు. అయితే… డ్వేన్‌ బ్రావో తాజాగా క్రికెట్‌ అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. తన ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కు గుడ్‌ బై చెబుతున్నట్లు తెలిపాడు బ్రావో. ప్రస్తుతం జరుగుతున్న టీ 20 ప్రపంచ కప్‌ టోర్నీ ముగిశాక రిటైర్‌ అవనున్నట్లు స్పష్టం చేశాడు బ్రావో.
 
గురువారం శ్రీ లంక తో జరిగిన మ్యాచ్‌ లో విండీస్‌ ఓటమి అనంతరం ఈ ప్రకటన చేశాడు. ” రిటైర్మెంట్‌ కు టైం వచ్చింది. 18 ఏళ్లుగా విండీస్‌ కు ఆడుతున్నా.. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. కానీ కరేబియన్‌ జట్టులో ఆడటం ఎల్లప్పుడూ లక్కీ గానే భావిస్తాను” అంటూ డ్వేన్‌ బ్రావో స్పష్టం చేశాడు.
 
మూడు ఐసీసీ ట్రోఫీలు నెగ్గి అంతర్జాతీయ స్థాయిలో విండీస్‌ పేరు నిలబెట్టుకున్నామన్నాడు. ఇక టీ 20 వరల్డ్‌ కప్‌ సిరీస్‌ తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటిస్తానన్నాడు. ఈ వ్యాఖ్యలు… లంకతో మ్యాచ్‌ అయ్యాక సోషల్‌ మీడియాలో చెప్పాడు బ్రావో. ఇక ఈ వార్త విన్న క్రికెట్‌ అభిమానులు షాక్‌ కు గురయ్యారు.