బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (16:05 IST)

ఐపీఎల్ వేలంలో రైనా తీసుకోకపోవడం ఏం బాగోలేదు.. ధోనీ అలా చేసి వుండాల్సింది..

ఐపీఎల్ మెగా వేలంలో సురేష్ రైనాను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. రైనాను తీసుకోకపోవడంపై సీఎస్కే అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టులతో తమ బాధను వెళ్లగక్కుతున్నారు. 
 
కరోనా కారణంగా 2020 సీజన్‌లో రైనా ఆడకపోయినా 2021 సీజన్‌లో అంచనాల మేరకు రాణించలేకపోయాడు. ఒకే ఒక సీజన్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని అతడిని వేలంలో కొనుగోలు చేయకపోవడం సరికాదని రైనా అభిమానులు, సీఎస్కే అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
 
సురేష్ రైనా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 205 మ్యాచ్‌లు ఆడి 5,528 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. రైనాను సీఎస్కే కొనుగోలు చేయకపోవడాన్ని నమ్మలేకపోతున్నానని, ధోనీ తప్పకుండా అతడి కోసం ప్రయత్నించి ఉండాల్సిందంటూ మరో అభిమాని ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు.