సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2019 (11:47 IST)

శిఖర్ ధావన్‌కు చోటు దక్కేనా?

ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్న భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం భారత ఏ జట్టు తరపున ఆడుతున్నాడు. తిరువనంతపురం వేదికగా సౌతాఫ్రికా ఏ జట్టుతో జరుగుతున్న క్రికెట్ సిరీస్‌లో ఆడుతున్నాడు. అయితే, బుధవారం ఈ వేదికలో నాలుగే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా పని పట్టేందుకు భారత యువ క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారు.
 
మరోవైపు, ఫామ్ లేమి సమస్యతో బాధపడుతున్న శిఖర్ ధావన్‌కు ఈ మ్యాచ్‌లో చోటు కల్పిస్తారో లేదో అన్న సందేహం ఉంది. అదేసమయంలో ముంబై ఆల్రౌండర్ శివమ్ దూబె దూకుడు జట్టుకు ఎంతో మేలు చేస్తుంటే, జట్టు సారథిగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.