గురువారం, 6 మార్చి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 మార్చి 2025 (09:31 IST)

ఫిబ్రవరి 23 మ్యాచ్‌తో పాకిస్థాన్ పోయింది... మార్చి 6 మ్యాచ్‌‍తో ఫైనలూ పోయింది... నెట్టింటి పేలుతున్న మీమ్స్

icc champions trophy
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు భారత్ చేరుకుంది. దీంతో ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న విషయం తెల్సిందే. ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన కారణంగా పాకిస్థాన్ జట్టు నాకౌట్ నుంచి నిష్క్రమించింది. ఇపుడు ఫైనల్ మ్యాచ్ కూడా పాకిస్థాన్ నుంచి దూరమైంది. దీంతో పాక్ జట్టుపై నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఫిబ్రవరి 23వ  తేదీన జరిగిన మ్యాచ్‌తో పాకిస్థాన్ ఇంటికిపోయింది... ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య మార్చి 6వ తేదీ జరిగిన మ్యాచ్‌తో పాకిస్థాన్ నుంచి ఫైనల్ మ్యాచ్ దూరమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 
హైబ్రిడ్ మోడల్ ప్రకారం భారత్ టైటిల్ పోరుకు అర్హత సాధిస్తే దుబాయ్ వేదికగానే ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది. టీమిండియాకాకుండా ఇతర జట్లూ ఫైనల్‌కు చేరితే తుది పోరు మాత్రం లాహోర్ వేదికగా నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. 
 
అయితే, మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సిక్స్ కొట్టడంతో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వేదిక ఒక్కక్షణంలో మారిపోయింది. ఫిబ్రవరి 23వ తేదీన పాక్ పోయింది.. ఇపుడు వేదికా పోయింది.. ఈ రెండింటిలోనూ విరాట్ కోహ్లితే కీలక పాత్ర కావడం గమనార్హం. 
 
అలాగే, చాంపియన్స్ ట్రోఫీ పాక్‌లో జరుగుతుంది. కానీ పాక్ మాత్రం లేదు. ఫైనల్‌కూ పాక్ ఆతిథ్యమిస్తుంది.. కానీ తుదిపోరు పాకిస్థాన్‌లో జరగడం లేదు. ఇపుడు భారత్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. కానీ పాకిస్థాన్‌లో ఆడదు అంటూ పేర్కొన్నారు.