మంగళవారం, 4 మార్చి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 మార్చి 2025 (16:19 IST)

చాంపియన్స్ ట్రోఫీ : ట్రావిస్ హెడ్ ఔట్ .. అయినా భారత్‌కు పొంచివున్న ప్రమాదం..

travis head
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, దుబాయ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి సెమీ ఫైల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఏమాత్రం ఆలోచన చేయకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత్‌ మ్యాచ్‌లలో కొరకరాని కొయ్యిగా పరిణమించే ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిడ్ హెడ్‌‍ను స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 
 
గతంలో ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లోనూ, వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ, బోర్డర్ గవాస్కర్ టెస్ట్ ఫైనల్‌లోనూ భారత్ టైటిల్ ముద్దాడకుండా అడ్డుకుంది కూడా ట్రావిస్ హెడ్డే. దీంతో మంగళవారం చాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో హెడ్ వ్యక్తిగతంగా 39 పరుగులు చేసిన సమయంలో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆఫ్ అండ్ మిడిల్ స్టంప్ లైనులో వరుణ్ విసిరిన బంతిని భారీ షాట్‌కు యత్నించి లాంగాఫ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా ఊపిరిపీల్చుకుంది. హెడ్ 33 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసింది. 
 
ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 23.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఇందులో ఓపెనర్ ట్రావిడ్ హెడ్ 39, కూపర్ 0, స్మిత్ 38 (నాటౌట్), మర్నస్ 29, జోష్ 4 చొప్పున పరుగులు చేశారు. మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజాలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.