సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2024 (17:04 IST)

పూణే టెస్ట్ మ్యాచ్ : న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 ఆలౌట్

new zealand
పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక కివీస్ జట్టు 259 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ ఇన్నింగ్స్‌లో తొలి మూడు వికెట్లను అశ్విన్ పడగొట్టగా, మిగిలిన ఏడు వికెట్లను వరుసగా సుందర్ ఖాతాలోకి చేరాయి. సుందర్ ఆఫ్ స్పిన్‌ను ఆడేందుకు కవీస్ ఆటగాళ్ళు ముప్పుతిప్పలు పడ్డారు. ఫలితంగా కివీస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌట్ అయింది. 
 
ఈ టెస్టులో తొలుత టాస్ గెలిచి కివీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పిచ్‌ స్పిన్‌కు పూర్తిగా అనుకూలించడంతో ఏ దశలోనూ కివీస్ ఆటగాళ్లు కుదురుగా బ్యాటింగ్ చేయలేకపపోయారు. కివీస్ జట్టులో డివాన్స్ కాన్వే 76, రచిన్ రవీంద్ర 65 పరుగులతో రాణించారు. 
 
న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత భారత్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే, రోహిత్ శ్రమ డకౌట్ అయ్యాడు. మొత్తం 9 పరుగులు ఎదుర్కొన్న రోహిత్.. పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌కు చేరాడు. కాగా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ఓపెనర్ జైస్వాల్ 6, గిల్ (0) పరుగులుతో క్రీజ్‌లో ఉన్నారు.