బుధవారం, 26 నవంబరు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన భారత్... 2-0 తేడాతో సిరీస్ కైవసం

south africa test team
స్వదేశంలో భారత్ క్రికెట్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో విఫలమైంది. దీంతో 408 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. ఫలితంగా టెస్ట్ సిరీస్‌ను సఫారీలు 2-0 తేడాతో కేవసం చేసుకున్నారు. 
 
ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ముంగిట సౌతాఫ్రికా జట్టు 549 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ టార్గెట్‌మను ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్... తన రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 140 పరుగులు మాత్రమే చేసింది. ఇందులో రవీంద్ర జడేజా చేసిన 54 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. ఫలితంగా సౌతాఫ్రికా జట్టు 408 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
ఈ విజయంతో 2-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఫలితంగా సౌతాఫ్రికా చేతిలో భారత్ వైట్‌వాష్‌కు గురైంది. సఫారీ బౌలర్లలో హార్మర్ 6, మహారాజ్ 2, ముత్తుసామి, మార్కో యాన్సన్ తలా ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 489 రన్స్ చేయగా, భారత్ 201 పరుగులుచేసింది. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీలు ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేశారు. భారత్ మాత్రం 140 పరుగులకే చేతులెత్తేసింది.