శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (16:11 IST)

ఇంగ్లాండ్-భారత్ వన్డే సిరీస్.. తొలి వన్డేలో శిఖర్ ధావన్ ఫిఫ్టీ మార్క్

టెస్టు, టి20 సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌పై కన్నేసింది. ఇంగ్లాండ్-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆరంభమైంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో రెండు జట్లు తలపడుతున్నాయి. 
 
ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో మొదట
Team India
బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌ నిలకడగా ఆడుతోంది. టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్.. అదిల్‌ రషీద్‌ వేసిన 24వ ఓవర్‌ తొలి బంతికి సిక్సర్‌ బాది అర్ధశతకం సాధించాడు. 68 బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్‌ సాయంతో ఫిఫ్టీ మార్క్‌ చేరుకున్నాడు. ఇంగ్లీష్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ పరుగులు రాబడుతున్నాడు. 
 
మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(28)తో కలిసి తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. ప్రస్తుతం ధావన్‌, విరాట్‌ కోహ్లీ భారీ భాగస్వామ్యం నెలకొల్పే దిశగా వీరిద్దరి బ్యాటింగ్‌ సాగుతోంది. 24 ఓవర్లకు భారత్‌ వికెట్‌ నష్టానికి 109 పరుగులు చేసింది. కోహ్లీ(27), ధావన్‌(52) క్రీజులో ఉన్నారు.