బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2023 (19:47 IST)

విశ్వవిజేత టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో భారత్.. ముమ్మరంగా ప్రాక్టీస్

team india practice
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ఈ నెల 19వ తేదీ ఆదివారం ఫైనల్ పోటీ జరుగనుంది. ఈ పోటీలో భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ జట్టు గురువారం రాత్రి అహ్మదాబాద్‌కు చేరుకుంది. శుక్రవారం నుంచి ముమ్మర ప్రాక్టీస్‌ను మొదలుపెట్టింది.
 
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. రోహిత్ శర్మ, రవీంద్ జడేజా, అశ్విన్ తదితర ఆటగాళ్లు మైదానంలో కనిపించారు. రోహిత్ శర్మ ఎక్కువగా కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌లతో చర్చిస్తూ మైదానంలో కనిపించారు. అలాగే, జట్టు సహచరులన సాధనను కూడా పరిశీలించారు. 
 
2003లో జరిగిన ప్రపంచ కప్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడగా, సౌతాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆసీస్ జట్టే విజేతగా నిలించింది. ఇన్నాళ్లకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. అదీకూడా సొంతగడ్డపై కంగారులకు ధీటుగా బదులిచ్చేందుకు సిద్దమైంది. ఏదైనా రెండు బలమైన జట్ల మధ్య జరిగే ఫైనల్‌లో కావడంతో అభిమానులను ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.