మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (13:38 IST)

నా దృష్టంతా ఐపీఎల్‌పైనే : రిషబ్ పంత్

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ పూర్తిగా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లలో రిషబ్ పంత్ చెత్త కీపింగ్ కారణంగా భారత్ ఓడిపోయింది. ప్రపంచ కప్‌కు ముందు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ టోర్నీలో కొందరు ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తే, మరికొందరు మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి వారిలో రిషబ్ పంత్ ఒకరు. 
 
ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిజానికి ప్రపచం కప్ పోటీల్లో ఆడాలన్నది ప్రతి క్రికెటర్ కోరిక. కానీ, ప్రస్తుతం తన ధ్యాస ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్-12వ సీజన్‌పైనే ఉంది. ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టును విజేతగా చూడలని అనుకుంటున్నట్టు చెప్పారు. 
 
అదే  సమయంలో ప్రతి ఆటగాడు ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగ్గా రాణించాలని భావిస్తాడు. ఇలాంటి వారిలో నేనూ ఒకడిని. ఇప్పటికే నా తప్పిదాలను కొన్నింటిని గమనించా. వాటిపై దృష్టిపెట్టాలి. నా తప్పిదాల గురించి ఇప్పటికే ధోనీని కలిసి మాట్లాడాను. డ్రెస్సింగ్‌ రూంలో ధోనీ చాలా ప్రశాంతంగా ఉంటాడు. అతడిని కలిసి ఏదైనా మాట్లాడొచ్చు. ప్రతీ ఒక్క ఆటగాడితో ధోనీ అలాగే ఉంటాడు. అందరినీ కలుపుకొని పోతాడు. దీంతో అతడు నుంచి మంచి సలహాలు, సూచనలు అందుతాయి. అవి పాటిస్తే మంచిది. లేదా ఎవరిష్టం వారిది అని పంత్ చెప్పుకొచ్చాడు.