గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2024 (12:26 IST)

రాజకీయాల్లోకి మహ్మద్ షమీ... బెంగాల్ నుంచి బీజేపీ తరపున పోటీ...

shami
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఆయన వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్ రాష్ట్ర నుంచి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేయనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇదే విషయంపై బీజేపీ నేతలు షమీతో ఒకసారి చర్చలు కూడా జరిపారని, వారి ప్రతిపాదనకు ఆయన సానూకులంగానే స్పందించినట్లు సమాచారం.
 
అన్నికుదిరితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లోని బసిర్‌హట్ నియోజకవర్గం నుంచి షమీని బరిలోకి దింపాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఫాస్ట్ బౌలర్ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పాల్సి ఉందట. ఇక బెంగాల్ క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం ఇదేమీ కొత్తకాదు. 
 
మహ్మద్ షమీ కంటే ముందే ఇద్దరు భారత ఆటగాళ్లు ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. వారే మనోజ్ తివారీ, అశోక్ దిండా. మనోజ్ తివారీ తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ తరపున గత ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం యువజన, క్రీడాశాఖ మంత్రిగా పని చేస్తున్నాడు. అలాగే అశోక్ దిండా కూడా బీజేపీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.