గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 అక్టోబరు 2021 (19:46 IST)

ఐసీసీ ట్వంటీ20 టోర్నీ : బంగ్లాదేశ్‌పై శ్రీలంక విజయం

ట్వంటీ20 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు విజయభేరీ మోగించింది. షార్జా వేదికగా సూపర్-12 పోరులో బంగ్లాదేశ్ - శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు భారీ స్కోరు సాధించింది. 
 
నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఓపెనర్ నయీం 52 బంతుల్లో 6 ఫోర్లతో 62 పరుగులు చేయగా, మిడిలార్డర్ లో సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీం 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు నమోదు చేశాడు.
 
శ్రీలంక బౌలర్లలో కరుణరత్నే 1, ఫెర్నాండో 1, లహిరు కుమార 1 వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదన ప్రారంభించిన లంక 3 ఓవర్లలో 1 వికెట్ నష్టపోయి 26 పరుగులు చేసింది.
 
ఆ తర్వాత 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సింహళీయులు బంగ్లాదేశ్‌పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక జట్టు 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. శ్రీలంక బ్యాట్స్‌మన్ చరిత్ అసలంక 49 బంతుల్లో 80 పరుగులు సాధించి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు.