బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By సిహెచ్
Last Modified: శనివారం, 19 అక్టోబరు 2019 (22:40 IST)

కోరికలు నెమ్మదిగా ఆవిరవుతూ వుంటుందనేందుకే...

దీపావళి వచ్చేస్తోంది. దీపావళి అనగానే దీపాలు వెలిగించడం గుర్తుకు వస్తుంద. ఐతే ఈ దీపాలు పవిత్ర సందర్భాలలోనూ జ్యోతి వెలిగించి ప్రారంభించే సంప్రదాయం మనకు ఉంది. దీప కాంతి చీకటిని పారదోలినట్లే, జ్ఞానం నిర్లక్ష్య ధోరణిని నిర్మూలిస్తుంది. అందుకే అన్ని రూపాల్లోని సంపద అయిన గొప్ప జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసం, అన్ని పవిత్ర సందర్భాలలోనూ మన ఆలోచనలకు, చర్యలకు సాక్ష్యంగా జ్యోతి వెలిగిస్తాము.
 
విద్యుత్‌ దీపాల సంగతిని పక్కనుంచితే  సంప్రదాయబద్దంగా వెలిగించే నూనె దీపానికి ఆధ్యాత్మిక గుర్తింపు ఎక్కువుగా ఉంటుంది. దీపపు కుందిలో పోసే నెయ్యి లెదా నూనె, వత్తి మనలోని కోరికలు, అహంభావ ధోరణులకు సంకేతం. భగవంతుని ముందు దీపం వెలిగించగానే మనలోని కోరికలు నెమ్మదిగా ఆవిరవుతూ, అహం కాలిపోతూ వుంటుందని అర్థం చేసుకోవాలి.