రుచికరమైన అల్పాహారాలు, ఏంటవి?
ఉదయం అల్పాహారం కాస్తంత రుచిగా లేకపోతే ఉదయాన్నే చిన్నారుల నుంచి పెద్దవారి వరకూ రుసరుసలే. ఈ నేపధ్యంలో గృహిణులు అల్పాహారం విషయంలో కాస్త గందరగోళంగా వుంటుంటారు. అలాంటివారికి ఇవిగో బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఫుడ్. ఓట్‌మీల్‌ను అల్పాహారంగా చేసుకోవచ్చు. ఇది త్వరగా రెడీ చేయగలగడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
ఊతప్పం అల్పాహారానికి ఉత్తమమైనది, తినడానికి చాలా రుచికరంగా కనిపిస్తుంది. అల్పాహారంగా వడను ఎంచుకోవచ్చు. పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టపడతారు. ఉల్లిపాయ పరోటా అల్పాహారంగా ఒక ఉత్తమ ఎంపిక, గ్రీన్ చట్నీతో సర్వ్ చేసి తింటే ఆ రుచే వేరు. పుంగనాలు, ఇవి తినడానికి చాలా రుచిగా వుంటాయి. గ్రీన్ చట్నీ, సాస్‌తో సర్వ్ చేస్తే సూపర్ టేస్ట్.
అల్పాహారంగా దోసె, కొబ్బరి చట్నీ చేయవచ్చు. ఇది ఆరోగ్యకరమైనది, పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇడ్లీ-సాంబార్ టేస్ట్ సూపర్‌గా వుంటుంది. ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. సింపుల్ అల్పాహారం పోహా. అటుకులు, దానిమ్మకాయ గింజలు కలిపి అల్పాహారంగా తీసుకోవచ్చు.