మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 జులై 2023 (17:11 IST)

మదురై స్పెషల్ బన్ పరోటా రెసిపీ మీ కోసం..

Bun Parotta
Bun Parotta
మదురై స్పెషల్ బన్ పరోటా రెసిపీ
కావలసిన పదార్థాలు:
మైదా - 2 కప్పులు
చక్కెర - 1 టీస్పూన్ 
గుడ్డు - 1 
ఉప్పు, నూనె - కావలసినంత 
 
తయారీ విధానం: ఒక వెడల్పాటి గిన్నెలో మైదా, కావలసినంత ఉప్పు, చక్కెర, ఒక గుడ్డు వేసి... ఆ పిండిని పరోటాలకు తగినట్లు సిద్ధం చేసుకోవాలి. ఇందులో ఆయిల్ చేర్చి రెండు గంటల పాటు పక్కనబెట్టేయాలి. 
 
రెండు గంటల తర్వాత ఆ పిండిని తీసి చిన్న చిన్న ఉండలుగా బన్ సైజ్ పరోటాలా రెడీ చేసుకుని.. బన్ పరోటాలా రుద్దుకోవాలి. వీటిని దోసె తవాపై వేసి బాగా కాల్చుకోవాలి. 
 
ఇరువైపులా బంగారు రంగులోకి వచ్చాక హాట్ ప్యాక్‌లో తీసుకోవాలి. అంతే రుచికరమైన, క్రిస్ప్రీగా మదురై బన్ పరోటా సిద్ధం. ఈ పరోటాకు చికన్ లేదా మటన్ గ్రేవీతో సర్వ్ చేస్తే రుచి అదిరిపోతుంది.