సోమవారం, 9 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 18 జులై 2022 (22:54 IST)

రుచికరమైన పొటాటో చీజ్ బాల్స్ టేస్ట్ చేయండి

Potato balls
అవసరమైన పదార్థాలు:
బంగాళాదుంపలు - 3
ఉల్లిపాయ - 2
కొత్తిమీర - కొద్దిగా
కేరట్ - 1/2 కప్పు (తురుము)
చీజ్ - 1/2 కప్పు (తురుము)
కార్న్ - తగినంత
కారం - 1 టేబుల్ స్పూన్
గరమ్ మసాలా - 1 టేబుల్ స్పూన్
కార్న్‌ఫ్లార్ - తగినంత
నూనె - తగినంత
ఉప్పు - తగినంత
బ్రెడ్ పౌడర్ - తగినంత


ఎలా చేయాలంటే?
బంగాళదుంపలను ఉడికించి మెత్తగా చేయాలి. అందులో తరిగిన ఉల్లిపాయ, తురిమిన క్యారెట్, పన్నీర్, మొక్కజొన్న, కొత్తిమీర, కారం, గరం మసాలా, ఉప్పు వేసి మెత్తగా చేయాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్‌ను నీటిలో కరిగించి, అందులో బాల్స్‌ను ముంచి, బ్రెడ్‌క్రంబ్స్‌లో రోల్ చేయండి.

 
ఈ బాల్స్‌ను నూనెలో వేయించాలి. ఈ పొటాటో బాల్స్ ఉడికి బంగారు రంగులోకి వచ్చాక నూనెలో నుంచి దించాలి. అంతే... రుచికరమైన పొటాటో చీజ్ బాల్స్ సిద్ధం.