శనివారం, 22 మార్చి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జనరల్ నాలెడ్జ్
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 21 మార్చి 2025 (21:37 IST)

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Banyan Tree
మర్రిచెట్టు ఊడలను చూస్తేనే చాలామందికి ఒళ్లు జలదరిస్తుంది. అంతేకాదు... మర్రిచెట్టుపైన దెయ్యాలు, భూతాలు వుంటాయంటూ ఇదివరకు చందమామ కథల్లో రాసేవారు. వాస్తవానికి దెయ్యాలు, భూతాలు వుంటాయో లేదో తెలియదు కానీ పెద్దపెద్ద ఊడలతో విస్తరించి వుండే మర్రిచెట్టును చూస్తే మాత్రం కొందరికి నిజంగానే భయం వేస్తుంది.
 
ఇక అసలు విషయానికి వస్తే... ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు మన భారతదేశంలోనే వున్నది. దీని వయసు 250 ఏళ్లు. హౌరాలోని శివపూర్ బొటానికల్ గార్డెన్‌లో ఇది వుంది. ఈ చెట్టు సుమారు 5 ఎకరాలపై విస్తరించి వుంది. వందలకొద్ది కొమ్మలతో, మర్రి ఊడలతో కనిపించే ఈ చెట్టు 486 మీటర్ల లావుగానూ, 24.5 మీటర్ల ఎత్తులో వుంది.
 
బ్రిటిష్ కాలంలో ఈ మర్రిచెట్టు వున్న ప్రాంతానికి రాయల్ ఇండియన్ బొటానికల్ గార్డెన్ అని నామకరణం చేసారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియన్ బొటానికల్ గార్డెన్ అయ్యింది. ఆచార్య జగదీష్ చంద్రబోస్ 150వ జయంతిని పురస్కరించుకుని ఈ బొటానికల్ గార్డెన్ పేరును ఆచార్య జగదీష్ చంద్రబోస్ బొటానికల్ గార్డెన్ అని పేరు పెట్టారు. అప్పట్లో 310 ఎకరాల్లో విస్తరించి వుండే ఈ బొటానికల్ గార్డెన్ ప్రస్తుతం 40 ఎకరాలకు పడిపోయింది.