అసలు గురక ఎందుకు వస్తుంది..?
గురక పెడితే బరువు తగ్గుతారా.. తగ్గవచ్చ లేదా తగ్గకపోవచ్చు. గురక అనేది మంచి పద్ధతి కాదంటున్నారు వైద్యులు. గురక పెడుతున్నప్పుడు పక్కవారు మిమ్మల్ని ఇబ్బంది పెడితే, మీ శరీరంలోనున్న క్యాలరీలను ఖర్చు చేస్తున్నట్లు వారికి చెప్పండి.
చాలామంది గాఢనిద్రపోతున్నప్పుడు గురక పెడుతుంటారు. దీంతో వారి శరీరంలో క్యాలరీలు ఖర్చుతవుతాయని వైద్యులు చెప్తున్నారు. రోగులు నిద్రపోతున్నప్పుడు వారు ఏ మాత్రం క్యాలరీలను ఖర్చు చేస్తున్నారు అనే అంశంపై పరిశోధన చేసినట్లు ఇటీవలే ఓ అధ్యయనంలో వెల్లడించారు. గాఢనిద్రలో ఉన్నవారు ఒక రోజుకు 375కు పైగా క్యాలరీలను ఖర్చు చేస్తారని పరిశోధనల్లో తేలినట్లు వైద్యులు చెప్తున్నారు. అదే అరగంటపాటు జిమ్‌లో వ్యాయామం చేస్తే కూడా అదే క్యాలరీలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.
బరువు తగ్గించుకునేందుకు గురకలు పెట్టడం ఏమంత మంచి పద్దతికాదని వైద్యులు సూచించారు. ఈ గురక అనేది కేవలం అధిక రక్తపోటును సూచిస్తుంది. దీంతో గుండెపోటుకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు. శరీరంలో ఒత్తిడి అధికండా ఉండి, బాగా అలసిపోయి నిద్రపోయినప్పుడే ఈ గురక అనేది వస్తుందని వైద్యులు స్పష్టం చేశారు.