శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 19 జనవరి 2024 (22:23 IST)

నడకతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Morning walk
ప్రతి రోజూ 45 నుంచి 60 నిమిషాలు నడకకు కేటాయించాలి. నడకతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ప్రతిరోజూ నడక అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది, రోజంతా శక్తినిస్తుంది. మెరుగైన ఆత్మగౌరవం, మంచి మానసిక స్థితి రావడంతో పాటు, ఒత్తిడి-ఆందోళన ఉదయం నడకతో తగ్గుతాయి.
 
నడక మెదడుకు రక్త సరఫరాను పెంచుతుంది, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సాధ్యమవుతుంది.
నడకతో మెలటోనిన్ అంటే నేచురల్ స్లీప్ హార్మోన్ ప్రభావాలను పెంచి సులభంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
రోజుకు సగటున 30 నిమిషాలు నడవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని 35% తగ్గించవచ్చు.
అధిక రక్తపోటు, శరీర కొవ్వు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించగల శక్తి నడకకి వుంది.
రోజువారీ 30 నిమిషాల నడకతో టైప్ -2 డయాబెటిస్, ఊబకాయం తగ్గుతాయి.
నడకతో కండరాల సమస్య, కీళ్ల నొప్పులను తగ్గుతాయి.